![]() |
![]() |
డాన్స్ ఐకాన్ సీజన్ 2 మంచి రేటింగ్ తో బాగా సాగుతోంది డాన్స్ ఎపిసోడ్. ఇక ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా మెంటార్ జాములూరి ఆమె కంటెస్టెంట్ షోనాలి ఇద్దరూ ఎలిమినేట్ ఇపోయారు. సోనాలికి బ్రౌన్ స్టార్ వచ్చినా కూడా ఎలిమినేట్ అయ్యింది..అంటే పంచ భూతాలుగా ఇక్కడ మెంటార్స్ ని రిప్రెజెంట్ చేసాడు యాంకర్ ఓంకార్. అంటే ఇప్పుడు జాను లూరి వాళ్ళు "వాటర్" ని రిప్రెజెంట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి వీళ్ళ ప్లేస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా కొత్త పెయిర్ ని తీసుకొచ్చారు. నెక్స్ట్ వీక్ ప్రోమోలో ఈ కొత్త జంటను చూపించారు. వాళ్ళు ఎవరో కాదు బుల్లితెర మీద సీరియల్స్ లో కనిపించే, బిగ్ బాస్ సీజన్ 7 కి వెళ్లిన ప్రియాంక జైన్ . ఇక ప్రియాంక జైన్ గురించి చెప్పక్కర్లేదు బుల్లితెర మీద "మౌనరాగం" సీరియల్లో తన హవభావాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది అమ్ములు అలియాస్ ప్రియాంక జైన్.. మాటలు రాని మూగ అమ్మాయి పాత్రలో జీవించేసి ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది. కన్నడలో రూపొందించిన ‘రంగి తరంగి’ ఈమె మొదటి సినిమా. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ప్రియాంక జైన్, తెలుగులో గోలిసోడా, చల్తే చల్తే, వినరా సోదరా వీరకుమారా, ఎవడూ తక్కువ కాదు లాంటి సినిమాల్లో నటించింది. బుల్లితెర మీద జానకి కలగనలేదు సీరియల్ లో నటించింది. ఇక ఇప్పుడు డాన్స్ ఐకాన్ కి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చేసింది మరి ఎలా చేస్తుందో చూడాలి.
![]() |
![]() |